బంజారాహిల్స్ : మేడారంలో కొలువుతీరిన సమ్మక్క సారలమ్మ దేవతలకు హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తరపున రహ్మత్‌నగర్ డివిజన్ ఆశయ్యనగర్ బస్తీ అధ్యక్షుడు నర్సింగరావు ఆధ్వర్యంలో ఎత్తు బంగారం (బెల్లం) తూకం వేసి పంపించారు.
ఆదివారం జూబ్లీహిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి బరువుకు సమానమైన బెల్లాన్నితూకం వేశారు. బెల్లాన్ని సమ్మక్క సారలమ్మ దేవతలకు సమర్పిస్తామని నర్సింగరావు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతికీ, సంప్రదాయానికి మారుపేరైన సమ్మక్క సారలమ్మలకు మొక్కు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రహ్మత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రవిశంకర్, సాబెర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.