బంజారాహిల్స్, మే 6: జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ డబుల్ బెడ్రూం ఇండ్లను గుట్టు చప్పుడు కాకుండా సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లోని పెద్దలు, అధికార పార్టీ నేతల ప్రయత్నాలపై నమస్తే తెలంగాణ మంగళవారం పారా హుషార్ పేరుతో ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టించింది. గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని కమలా నగర్ బస్తీలో నిర్మించిన 210 డబుల్ ఇండ్లలో స్థానికులకు కేటాయించగా మిగిలిపోయిన 60 ఇండ్లపై పైరవీకారులు ప్రభుత్వ పెద్దలు కన్నేశారు.
గుట్టు చప్పుడు కాకుండా సుమారు 68 మందిని లబ్ధిదారులుగా ప్రతిపాదిస్తూ జాబితాలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కోటా కింద కొన్ని ఇండ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తాజాగా తెలిసింది. దీంతో పాటు నియోజక వర్గంతో సంబంధం లేని వారి పేర్లు జాబితాలో ఉండడంతో స్థానికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే రాణిగంజ్ సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన నలుగురు పేర్లను జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు యూసుఫ్ గూడ, ఎల్ నగర్, ఎల్లారెడ్డి గూడ, ఖైరతాబాద్ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీ ప్రాంతాలకు చెందిన వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో 60 డబుల్ బెడ్రూం ఇండ్లను తమవారికే ఇచ్చుకునేలా అధికార పార్టీ నేతలు చక్రం తిప్పినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. జాబితాలో ఉన్నవారిలో ఎవరెవరికి ఎంత ముట్టింది అనే అంశాలతో పాటు ఎవరి కోటా కింద మిగతా IIవ పేజీలో