వెంగళరావునగర్, నవంబర్ 5: ఎల్లారెడ్డిగూడలో శుక్రవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీపావళి పండగ మరుసటి రోజున యాదవులు జరుపుకునే దున్నపోతుల పండగ (సదర్)ను ఎల్లారెడ్డిగుడలో ఘనంగా జరుపుకున్నారు. ఎల్లారెడ్డిగూడ చౌరస్తాలో వేదికను ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులతో ఊరేగింపు ప్రారంభమైయింది. ఈ సందర్భంగా యాదవులు దున్నపోతులను రంగులు, చెమికీలతో అలంకరించి ఊరేగించారు. నాశంగారి మల్లేష్ యాదవ్, మధు యాదవ్,మహేష్ యాదవ్‌లు నిర్వహించే ఈ సదర్‌కు ప్రత్యేకత ఉంది.ఆల్ఇండియో ఛాంపియన్ ఖలీ,కింగ్ దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి సదర్ ఉత్సవాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్,డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, శరత్ గౌడ్,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.