జూబ్లీహిల్స్,సెప్టెంబర్4: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగప డుతున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ప్రత్యేక కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుల మతాలకతీతంగా, అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో వివిధ రాష్ర్టాల నుంచి వలస వస్తున్న పేదలందరూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ సందర్భంగా యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ డివిజన్లకు చెందిన 73 మంది లబ్ధిదారులకు రూ.73,08,468 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వీఆర్వో విజయుడు, కార్పొరేటర్లు బండారి రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సంతోశ్ ముదిరాజ్, నర్సింగ్ దాస్, నాగరాజు, రజినీకాంత్, సుబ్బరాజు, విజయ్ ముదిరాజ్, అప్పూఖాన్, తన్నూఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, సెబ్టెంబర్ 4: వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్, మధురానగర్ కాలనీ వంద శాతం వ్యాక్సినేషన్ సాధించిన సందర్భంగా శనివారం మధురానగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై కార్పొరేటర్ దేదీప్య విజయ్‌కు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమష్టి భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వైద్య సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్, నోడల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.