వెంగళరావునగర్, ఆగస్టు 10: జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ మసీదుగడ్డ వద్ద రూ. 21 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీవరేజీ లైన్ల పనులను కార్పొరేటర్ దేదీప్య విజయ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఉచిత తాగునీటి పథ కానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. వాటర్ వర్క్స్ మేనేజర్ రమేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, మాజీ కార్పొరేటర్ శ్యామ్‌రావు, వేణుగోపాల్ యాదవ్, చిన్న రమేశ్, నవాజ్, అఫ్సర్, సత్యనారాయణ, పూజారి బాలరాజు, శంకర్ పాల్గొన్నారు. వెంగళరావునగర్ను ఆదర్శ డివిజన్‌గా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని వెంగళరావునగర్ కా ర్పొరేటర్ దేదీప్య విజయ్ అన్నారు. మంగళవారం జవహర్ నగర్లో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు.
వెంగళరావునగర్, ఆగస్టు 10: కరోనాను జయించాలంటే టీకా తప్పనిసరి అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కు వద్ద మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారినుంచి ప్రజలను కాపాడేందుకు మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.