షేక్‌పేట్, జూలై 2: సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షే మం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, డీసీ సేవా ఇస్లావత్‌తో కలిసి షేక్‌పేట్ డివిజన్ వెటర్నరీ కాలనీలో మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్: పచ్చదనాన్ని పెంచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీల్లో వ్యర్థాల తొలగింపు చేపట్టారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, బాలాపుర బస్తీ, ద్వారకాపురి కాలనీల్లో కార్పొరేటర్ విజయారెడ్డి పర్యటించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్వారకాపురి కాలనీలో వరదనీరు వెళ్లకుండా ఓ ఇంటివద్ద నిర్మించిన ర్యాంప్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్లో కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
శ్రీనగర్‌కాలనీ: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్లోని శ్రీనికేతన్కాలనీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం స్థానికులతో కలిసి వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి, ఏఈ ఆనంద్, రవి, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ సావిత్రి, సిబ్బందితో పాటు టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్‌దాస్, చిన్నాయాదవ్, వేణుగోపాల్, సంతోష్, బాబీ, సాయి, అబ్బు, సాయితేజ, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.
అమీర్‌పేట్: సనత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతా ల్లో పారిశుధ్య పనులను కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, ఖైరతాబాద్ సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ భార్గవ్ నారాయణతో కలిసి పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగుపడేలా అధికారులు శక్తికి మించి కృషి చేస్తున్నారని, పౌరులు కూడా తమ వంతు తోడ్పాటును అందిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
బేగంపేట్: బస్తీలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుచిత్ర సూచించారు. రాంగోపాల్‌పేట్ డివిజన్లోని డీవీకాలనీలో మట్టికుప్పల తొలగింపు పనులు చేపట్టారు.
వెంగళరావునగర్: స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లోని నవోదయ కాలనీ, గణపతి కాంప్లెక్స్ వెనుక ప్రాంతాల్లో ఆమె పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రపరిచారు. అనంతరం కాలనీలో మొక్కలను నాటారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్‌యాదవ్, తన్నూఖాన్, మధుయాదవ్, శరత్‌గౌడ్ పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మధురానగర్, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్ ప్రాంతాల్లో సిబ్బంది చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను చెత్తాచెదారంతో నింపొద్దని.. ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు విజయ్, వేణు, గోపాల్‌యాదవ్, చిన్న రమేశ్, శౌరి, రాజు పాల్గొన్నారు.