వెంగళరావునగర్, జూన్ 28: కరోనాను తరమికొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్‌తో కలిసి ఎమ్మెల్యే మాగంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కరోనా బారినపడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. కరోనా పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం తగదని పేర్కొన్నారు. కరోనా వైరస్ బారినపడిన వారికి తమ ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలను పేదలకు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రమేశ్, డీఎంహెచ్‌వో డాక్టర్ అనురాధ, మధురానగర్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వప్రకాశ్, సెక్రటరి చారి, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు వేణు, శ్యామ్ ముదిరాజ్, చిన్న, బాలకృష్ణ, అజ్జూ సింగ్‌తో పాటు డివిజన్ సంక్షేమ సంఘాల నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.