బంజారాహిల్స్, జూన్ 27: తెలంగాణ రా్రష్ట్రంలో కష్టాల్లో ఉన్న బీసీలను ఆ దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ డివిజన్‌కు చెందిన రాజేశ్వరి, స్వప్నకు మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఆదివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ముదిరాజ్ కులస్తుల ప్రయోజనం కోసం చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టిన ప్రభుత్వం పట్టణాల్లో నివసించే వారికోసం సంచార చేపల విక్రయ వాహనాలను సమకూరుస్తున్నదన్నారు. కులవృత్తుల మీద ఆధారపడే వారికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు అందజేశారు. ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన అబ్దుల్ రఫీక్‌కు రూ.60వేలు, ఆయేషా సమ్రీన్‌కు రూ.28వేలు, జులేకా బేగంకు రూ.16వేల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే మాగంటి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ పాల్గొన్నారు.