వెంగళరావునగర్, జూన్ 19: పేదల సంక్షేమమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ లోని అంబేద్కర్ నగర్ లో రూ.25 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నా రు. పేదలు ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను వినియోగించుకునే స్థోమత ఉండదని.. అలాంటి వాళ్లకు ఈ కమ్యూనిటీహాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బర్త్ డే ఫంక్షన్లు, మ్యారేజ్ ఫంక్షన్లు చేసుకునేందుకు ఈ ఫంక్షన్ హాలు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, డివిజన్ నాయకులు తన్నూఖాన్, శరత్ గౌడ్, మధు, సత్యనారాయణ పాల్గొన్నారు.