బాలానగర్, ఆగస్టు 17 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి సిండికేట్‌బ్యాంక్ కాలనీలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న కమ్యూనిటీహాల్‌ను స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూలేని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు సేవలందించినట్లు తెలిపారు.
నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రధాన్యతను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ ఏఈ ఆశ, నాయకులు కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, మన్నె ఉదయ్ యాదవ్, హరినాథ్, కాలనీవాసులు మైపాల్‌రెడ్డి, కృష్ణయ్య, సత్యమూర్తి, మాధవరెడ్డి, బాలయ్య, మల్లేష్ యాదవ్, చందు యాదవ్, అరవింద్, భాస్కర్, బిక్షపతి, భారతమ్మ, సంద్యారాణి, జగదీశ్, పెద్దిరాజు, మురళీ మనోహర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.