కూకట్పల్లి, నవంబర్2: బాలానగర్లో డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ ఆవులరవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం శంకుస్థాపన చేశారు. బాలానగర్ డివిజన్ పరిధిలో రూ. 1. 79 లక్షల వ్యయంతో రాజీవ్ గాంధీ నగర్లో సీసీ రోడ్లు, బాలానగర్ ఫ్లైఓవర్ కింద స్మార్ట్ పార్కింగ్, వినాయక్ నగర్ పంచవటి నాలా వద్ద కల్వర్ట్ బాక్స్ నిర్మాణ పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజక వర్గంలో ప్రతి డివిజన్లో ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తూ ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడమే తన ముఖ్య ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ గోవర్ధన్ గౌడ్, డీఈ శ్రీరాములు, ఏఈ రషీద్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ, బస్తీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.