కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 31 : దేశంలో ఐదువందలకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ సర్దార్‌పటేల్‌నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి ఉప ప్రధానిగా దేశ అభ్యున్నతి కోసం కృషి చేశారని ఐదువందల ముప్పై సంస్థానాలను విలీనం చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు స్వాతంత్య్రాన్ని అందించారని కొనియాడారు. ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సాయిబాబా, రాజేశ్ తదితరులు ఉన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమైక్య స్ఫూర్తి ప్రధాత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ అని కీర్తించారు. మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కె.నరసింగరావు, శివసత్యనారాయణ, శంకర్, లక్ష్మీనారాయణ, యేసురాజు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థానాలను విలీనం చేయడంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు కె.రవికుమార్, రవీందర్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మూసాపేట, అక్టోబర్31: స్వాతంత్య్ర సమరయోధుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మూసాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మూసాపేటలో ఏర్పాటు చేసిన పటేల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, బి.నర్సింగ్‌రావు, తుకారాం, విష్ణు, శంకర్, సత్యనారాయణ, జైరాజ్, అరుణ్, దస్తగిరి, అర్జున్, పవన్, వీరచారి, రమేశ్, కృష్ణ, నిఖిల్, స్వామి తదితరులు పాల్గొన్నారు.