బాలానగర్, సెఫ్టెంబర్ 3 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో రూ.2.76 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని శాంతినికేతన్కాలనీ, హరిజనబస్తీ, రామకృష్ణకాలనీ, లక్ష్మీనర్సింహకాలనీ, టీచర్స్‌కాలనీ, భవానీనగర్, మణికంఠకాలనీ, ఎల్బీనగర్, రెడ్డి హోటల్, కోయబస్తీ, హస్మత్‌పేట హనుమాన్ ఆలయం, ఎంఐఎం కార్యాలయం రోడ్డు, అబ్రార్‌నగర్, అంజయ్యనగర్, సిండికేట్‌బ్యాంక్ ఆఫీసర్స్కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ జనరంజకపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూలేని అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిపారుదల రంగాన్ని మెరుగుపరిచినట్లు తెలిపారు.
ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో మెరుగైన అభివృద్ధి చేయడం కోసం కోట్లాది నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఎల్లప్పుడూ కృషి చేయనున్నట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కూకట్పల్లి, బాలానగర్‌లో వెయ్యికోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు.
ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు, అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ హాల్స్, అన్ని సామాజిక వర్గాల వారి గ్రేవ్యార్డ్ల అభివృద్ధికి సైతం తనవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ.. కూకట్పల్లి ఎమ్మెల్యే సహకారంతో ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యల పట్ల నిబద్ధతతో ఉండి సేవ చేసే వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం సంతోషదాయకం అన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్‌గౌడ్, సికింద్రాబాద్ డివిజన్ రైల్వేబోర్డు సభ్యుడు కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్ కర్రె లావణ్య, మైనార్టీ నాయకులు సయ్యద్ ఎజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, మక్కల నర్సింగ్, బల్వంత్‌రెడ్డి, హరినాథ్, ఉదయ్‌యాదవ్, ఖదీర్, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.