మూసాపేట, జూలై 3: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం మూసాపేట డివిజన్ పరిధిలోని కబీర్‌నగర్ నుంచి రామారావు నగర్ వరకు రూ. 45 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులకు టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, జలమండలి డీజీఎం రవికుమార్, మేనేజర్ శ్రీనివాస్‌తో కలసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. కాలనీల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్యం, రమేశ్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, వంజరి వెంకటేశ్, కబీర్‌నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జోసెఫ్, అంజిరెడ్డి, మాజీద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. డివిజన్ పరిధి అవంతినగర్లోని తోట సాయిబాబా ఆలయం వార్షికోత్సవానికి మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్‌తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 3 : కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని త్వరితగతిన ఆవిష్కరించేలా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థలంలో మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. మహాత్మాగాంధీ విగ్రహ పరిసరాలన్నీ సుందరంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. చుట్టూరా పచ్చని గార్డెనింగ్, రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులు ఉండేలా పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్ పగడాల శిరీష, ఎస్ఈ శంకర్ నాయక్, ఏఈ సాయిప్రసాద్, మాజీ కార్పొరేటర్ బాబూరావు పాల్గొన్నారు.
అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ చెక్కులను నియోజకవర్గానికి చెందిన ఎన్.నాగరవి రూ.3.50 లక్షలు, మహ్మద్ ఖాజాపాషా రూ.2 లక్షలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. వైద్య ఖర్చులు చెల్లించడానికి ఇబ్బంది పడే పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందన్నారు.