హైదరాబాద్ : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) సర్వే అధికారులకు ఝలక్ ఇచ్చారు. కులగణన సర్వే చేయటానికి(Caste census survey) అధికారులు ఆయన కార్యాలయానికి చేరుకోగా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించారు. ఆరోజు సర్వే వద్దని ఇప్పుడు ఏం మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు, వాహనాలు, తదితర స్థిర, చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని అధికారులను నిలదీశారు.
సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులు
రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఆరోజు సర్వే వద్దని ఇప్పుడు ఏం మోహంతో రేవంత్ రెడ్డి… pic.twitter.com/GKS8ZdPoWq
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2024
https://x.com/TeluguScribe/status/1855844127583183355