కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 20 : శ్రీశ్రీనగర్ కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం క్యాంపు ఆఫీస్లో నూతనంగా ఎన్నికైన శ్రీశ్రీ నగర్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కృష్ణారావు అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీశ్రీ నగర్ కాలనీలో ప్రజా సమస్యలను గుర్తించి తనవద్దకు తీసుకోస్తే..ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కమిటీ సభ్యులు సంఘటితంగా పనిచేసి కాలనీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పి.దుర్గేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కిట్టు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు ఉన్నారు.