రామంతాపూర్,జనవరి 1 : మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy), ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఉప్పల్ భారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉప్పల్‌లో గాంధీ (Gandhiji) విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. భారత్ యువజన సంఘం మొదటి నుంచి అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారన్నారని ప్రశంసించారు.
భవిష్యల్ కూడా సేవా కార్యాకార్యక్రమాలు కొనసాగించాలిని ఆక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, యువజన సంఘం నేతలు దుబ్బ నర్సింహరెడ్డి, అర్జున్ కార్పొరేటర్లు ప్రభుదాసు, గంధం నాగేశ్వర్రావు, సాయిజెన్ శేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.