కుత్బుల్లాపూర్, డిసెంబర్ 10 : ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశించారు. శనివారం నియోజకవర్గానికి చెందిన పలు స్వచ్ఛంద సంఘాలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించి న ఆయన వెంటనే.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి.. సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.