గోల్నాక : అంబర్‌పేట నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం అంబర్‌పేట డివిజన్ బాపునగర్ కాకతీయ మార్కెట్ లైన్లో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్‌తో పాటు పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా డ్రైనేజీ లైన్ల ఏర్పాటుతోపాటు కొత్తగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం విష్ణువర్ధన్ రెడ్డి, ఏఈ ప్రదీప్ కుమార్, ఏఈ శ్రీనివాస్ వర్మ, వర్క్ ఇన్స్పెక్టర్లు రమేష్, దుర్గ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, నాయకులు ఆమనూరి సతీష్, రాజ్ కుమార్, సలీం, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.