కాచిగూడ, మార్చి 10: పేదల సంక్షే మం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీకే పట్టభద్రులు పట్టం కట్టాలని ఎమ్మెల్యే కా లేరు వెంకటేశ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు భీమగౌని కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మణ్‌రావు జమాల్బస్తీ, నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సురభి వాణీదేవిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే గ్రాడ్యుయేట్ల సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాశ్ యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల రవీందర్‌యాదవ్, సునీల్బిడ్లాన్, నాగేందర్బాబ్జి, భీష్మ పాల్గొన్నారు.
నింబోలిఅడ్డాలో… హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులు ఎర్ర భీష్మ, పట్లూరి సతీశ్ ఆధ్వర్యంలో బుధవారం నింబోలిఅడ్డా, బండల్బస్తీ, తదిర ప్రాంతాల్లో పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి వాణీదేవికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
గోల్నాక, మార్చి 10 : పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. బుధవారం అంబర్‌పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పట్టం కట్టాలని కోరారు.
కమలానగర్లో.. ఈ నెల 14న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం ఆయన గోల్నాక డివిజన్ కమలానగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి తమ ఓటును టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి వేయాలని కోరారు.
14న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవి అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ బుధవారం భువనగిరి ఎల్లమ్మతల్లిని దర్శించుకొని టీఆర్ఎస్ నాయకుడు బీవీ రమణ పూజలు చేశారు.