కాచిగూడ, సెప్టెంబర్ 21: ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని నింబోలిఅడ్డా ఎస్సీ హాస్టల్ సమీపంలో రూ.6 లక్షలతో చేపట్టిన ఫుట్‌పాత్ నిర్మాణ పనులను మంగళవారం గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్తీలలో పాదయాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లల్లోకి నీరు వస్తుందని, దీంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యా దు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఫుట్‌పాత్‌లను ఆధునీకరించి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణపు పనుల్లో స్థానికులు అధికారులను ఎప్పటికప్పుడు నిలదీసినప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని సూచించారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు. ఎస్సీ హాస్టల్ లైన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఎంహెచ్‌వో జ్యోతి, ఏఈ ఫరీద్, మనోహర్, శాకీర్, ఏఈ సత్య, ఆర్కే బాబు, కాశీ నరేశ్, నర్సింగ్‌యాదవ్, పల్లవి, రెడపాక రాము, అనిల్‌యాదవ్, అంజయ్యచారి, ప్రభాకర్, పి.సంతోశ్, సతీశ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.