అంబర్‌పేట, ఆగస్టు 30 : అంబర్‌పేట సీపీఎల్‌లో గల లకోటియా ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి రూ.60లక్షలు మం జూరు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డీప్యూటీ ఈవో గాజుల శ్రీధర్, కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్, దూసరి లావణ్యశ్రీనివాస్లతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం అంబర్‌పేటలోని లకోటియా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా ఇక్కడ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధుశాలిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుత పాఠశాల భవనం, కొత్త భవనానికి మధ్య కనెక్టివిటి లేదని, కొత్త భవనంలో టా యిలెట్ల సౌకర్యం లేదని హెచ్ఎం కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే కాలే రు కల్పించుకొని తన ని యోజకవర్గం అభివృద్ధి ని ధుల నుంచి రూ.60 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. మొదట పాఠశాలలో సివిల్ వర్క్స్ పూర్తి చేద్దామని, ఇవి పూర్తైన తరువాత కొత్త భవనంలో బెంచీలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేద్దామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్, దూసరి లావణ్యగౌడ్, డాక్టర్లు కాలేరు దీప్తిపటేల్, గీతారాణి, ఇతర జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది కలిసి బస్తీల్లో వ్యాక్సినేషన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఇంటింటికీ తిరిగి చెప్పారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ పాలుపంచుకున్నారు.