కాచిగూడ, ఆగస్టు 28: పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య పరమైన సమస్యలను దూరం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. హర్రస్పెంట శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్. గోపాల్‌రావు ఆధ్వర్యంలో పేదల కోసం శనివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్, కార్డియాలజి, గైనకాలజీకి సంబంధించిన పరీక్షలు అందిస్తున్నట్లు అధ్యక్షుడు గోపాల్‌రావు పేర్కొన్నారు. ఇందులో 570 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని, మందులను పొందినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి నెలా ప్రత్యేకమైన వైద్య క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్పటేల్, రాజ్కుమార్విగ్, వీరస్వామి, సాయిగిరిధర్, బి. కృష్ణాగౌడ్, సత్యనారాయణ, విజయ్‌కుమార్, అనిల్, బల్వీర్‌సింగ్, నర్సింగ్‌రావు, డాక్టర్లు కొండ శ్రీనివాస్‌రావు, పండరి, తార, సీతారామ్ మహాపాత్ర, పట్లూరి సతీశ్, కుమార్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.