గోల్నాక, ఆగస్టు 27: జీహెచ్ఎంసీ పరిధిలో అందరికీ టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌ను వంద శాతం పూర్తి చేస్తామని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ లంకలో ఆమె శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి పర్యటించారు. టీకాలు తీసుకున్న పలువురికి సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయిం చుకోవాలని కోరారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
అన్ని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ డి ప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం గోల్నాక తులసీరాంనగర్ లంక ప్రభుత్వ పాఠశాలను స్థానిక కార్పొరేటర్ దూ సరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి పాఠశాలలో చేపట్టిన శానిటైజేషన్ పనులను పరిశీలించి తరగతుల నిర్వహణ గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొవిడ్ నిబంధనలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక టీఆర్‌ఎస్‌నాయకులు పాల్గొన్నారు.