గోల్నాక, ఆగస్టు 25 : ని యోజకవర్గంలోని పలు ప్రాం తాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త పైప్లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్లోని శాం తినగర్లో రూ.7 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పా టు చేస్తున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జలమండలి ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు భూపతిలక్ష్మణ్, ఆర్ రాము, ఆర్కే బాబు, కట్టెల సతీశ్‌కుమార్, అనిల్, భిక్షపతి, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, నర్సింగ్‌యాదవ్, అబ్బు, ప్రభాకర్, ఉమేశ్, మల్లేశ్, రాజు పాల్గొన్నారు.
అనంతరం వ్యాక్సినేషన్ డ్రైవ్ పరిశీలన..
వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్ గంగానగర్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.