కాచిగూడ,ఆగస్టు 13: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడలోని నింబోలిఅడ్డా జువైనల్ హోంలో రూ.3.60 కోట్లతో మూడంతస్థుల నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలకు అవకాశమిస్తే సాధించలేనిది ఏదీలేదన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, లేనియెడల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే సహనం, ఓపిక వంటి మంచి లక్షణాలను నేర్పించాలని తెలిపారు. పిల్లలు తల్లిదండ్రులకు పలు సమస్యలపై ఫిర్యాదు చేస్తే శ్రద్ధగా వినాలని, లేకుంటే చెడుదారి పట్టే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, దూసరి శ్రీనివాస్‌గౌడ్, బాలికల సదనం సూపరింటెండెంట్ మైథిలి, లలిత, ఎర్ర భీష్మ, రెడపాక రాము, నర్సింగ్‌యాదవ్, పట్లూరి సతీశ్, యూసుఫ్శరీఫ్, పి.సంతోష్, సాయి విద్యార్థులు పాల్గొన్నారు.