మన్సూరాబాద్, ఆగస్టు 29 : నాగోల్ డివిజన్ పరిధిలోని సెవన్హీల్స్కాలనీ సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎంఆర్డీసీ చైర్మన్‌కు కాలనీ అధ్యక్షుడు కత్తుల రాంబాబు ఆదివారం వినతిపత్రం అందజేశారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ పైపులైన్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల తొలగింపు, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రక్రియపై త్వరలో సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్, కార్యదర్శి శోభన్, కోశాధికారి కమలాకర్, సభ్యులు మధు, చంద్రశేఖర్ గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.