ఎల్బీనగర్, ఆగస్టు 29 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం లింగోజిగూడ డివిజన్లోని కాలనీల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లింగోజిగూడ డివిజన్లో నూతన ట్రాన్స్ఫార్మర్లతో పాటుగా కమ్యూనిటీ హాళ్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. సాయినగర్ కాలనీ నుంచి ధర్మపురి కాలనీ వరకు నూతనంగా వీడీసీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ధర్మపురి కాలనీలోని 600 గజాల స్థలంలో కమ్యూనిటీహాల్ శిథిలావస్థకు చేరిందని, దాని స్థానంలో నూతన కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కాలనీల్లో సీసీ కెమెరాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిలక్‌రావు, వరప్రసాద్‌రెడ్డి, ధర్మపురి కాలనీ అధ్యక్షుడు జి.ఎస్. రాజు, సాయినగర్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, సౌభాగ్యనగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ మధుసాగర్, వెంకటేశ్, శేఖర్‌గుప్తా, భీంరెడ్డి, అర్జున్‌రెడ్డి, కొండల్, అమ్రేశ్, రామ, చిత్రం సాయి తదితరులు పాల్గొన్నారు.