ఎల్బీనగర్, ఆగస్టు 27 : రాబోయే 25 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు రోడ్డు వెడల్పు పనులతో పాటుగా ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ చౌరస్తా, బైరామల్‌గూడ చౌరస్తా ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్ఆర్డీపీ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. ప్రజలను ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి చేయడంతో పాటుగా సులువుగా ప్రయాణం సాగించే విధంగా ఎస్ఆర్డీపీ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయన్నారు.
2030 నాటికి పెరిగే వాహనాలకు అనుగుణంగా సాఫీగా ప్రయాణం సాగించేలా పక్కా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ైప్లె, స్కై ఓవర్ పనులను త్వరగా పూర్తిచేయడానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ పనులు పూర్తయితే రోడ్లపై చిక్కులు లేని ప్రయాణం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్యాంసన్, ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ కార్తిక్, రమేశ్‌బాబు, మణి హారిక, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.