సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం: ఇటీవల సాహెబ్‌నగర్‌లో జరిగిన మ్యాన్‌హోల్ దుర్ఘటనలో మృతి చెందిన ఇద్దరు ప్రైవేట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరో చేయూతనందించింది. ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారు. వనస్థలిపురం రైతుబజార్ జై భవాని నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం గృహ సముదాయంలో 702 నంబర్ ఇంటిని శివకుమార్ భార్య ధరణి శ్రావణి గౌరికి, 701 నంబర్ ఇంటిని అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మకు కేటాయించారు. ఈ మేరకు సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంజూరు పత్రాలను అందజేశారు. ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.