ఎల్బీనగర్/మన్సూరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని త్యాగం చేశారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి ప్రగతినగర్ చౌరస్తాలో విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఎల్బీనగర్ అధ్యక్షుడు నాగోజు రామాచారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, ఎల్బీనగర్ అధ్యక్షుడు నాగోజు రామాచారి, ప్రధాన కార్యదర్శి పర్వతం శ్రీనివాస చారి, కోశాధికారి కృష్ణమాచారి, అందోజు శ్రీనివాస చారి, రాజు, రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో యువత ముందడుగు వేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని చంపాపేటలో మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, నాయకులు బైగళ్ల రాము, రామలక్ష్మణ్, సతీశ్ గౌడ్, హుస్సేన్ యాదవ్, నర్సింహారెడ్డి, ఈశ్వర్ గుప్తా, సాయి, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
చైతన్యపురి చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాచం సాయితో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని కర్మన్‌ఘాట్‌లో మాజీ వార్డు కమిటీ సభ్యుడు ముడుపు రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు రఘుమారెడ్డి హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యురాలు అనసూయ, గోపాల్ ముదిరాజ్, గోగు శేఖర్‌రెడ్డి, గౌతంరెడ్డి, చీర తిరుమలేశ్, జంగయ్య, విద్యాసాగర్, మేక సురేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.