వనస్థలిపురం, అక్టోబర్ 29 : కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ పిండి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్-2 సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. తమ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులకు సిఫారసు చేస్తామని, మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైనా సంక్షేమ సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘం కృషిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డబ్బీకార్ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయాదవ్, దామోదర్‌రెడ్డి, మల్లేశ్ గౌడ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.