మన్సూరాబాద్, అక్టోబర్ 23 : బండ్లగూడ చెరువుకు ఎగువన, దిగువన నివసించే ప్రజలకు వర్షా కాలంలో వరద ముంపు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ చెరువు పరిసర ప్రాంతాలతో పాటు అయ్యప్పనగర్ కాలనీలో శనివారం సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ్లగూడ చెరువు నుంచి దిగువకు నీరు వెళ్లేందుకు రాబోయే 10 రోజుల్లో ఓపెన్ డ్రైన్ పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఓపెన్ డ్రైన్ పనులు పూర్తయితే చెరువు దిగువన ఉన్న శ్రీనివాసకాలనీ, విజయగార్డెన్ తదితర కాలనీలలో భవిష్యత్‌లో వరద ముంపు ఉండదని తెలిపారు. చెరువుకు ఎగువన ఉన్న అయ్యప్పకాలనీకి సైతం వరద ముంపు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాల వల్ల ఇటీవల కాలంలో పలు కాలనీలలో దెబ్బతిన్న రోడ్లను త్వరలో పునరుద్ధరింపజేస్తామని తెలిపారు. దశలవారీగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్, నాయకులు ప్రశాంత్‌గౌడ్, రాజిరెడ్డి, తూర్పాటి కృష్ణ, చెరుకు జంగయ్యగౌడ్, రాజుగౌడ్, సతీశ్‌యాదవ్, రాఘవేందర్, రామకృష్ణారెడ్డి ఉన్నారు.