ఎల్బీనగర్, అక్టోబర్ 12: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ నూతన కార్యవర్గం.. మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావుతోపాటు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీనగర్లో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ నాయకులంతా ఐకమత్యంతో కలిసికట్టుగా సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, నాయకులు నర్రె శ్రీనివాస్ కురుమ, కందికంటి శ్రీధర్‌గౌడ్, తిలక్‌రావు, ఇంద్రాజీ, పార్టీ, అనుబంధ కమిటీల కార్యావర్గ సభ్యులు పాల్గొన్నారు.
చంపాపేట: పార్టీ విస్తరనే లక్ష్యంగా డివిజన్ కమిటీలు పనిచేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ నూతన కమిటీ మంగళవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ డివిజన్ కమిటీ సభ్యులంతా పార్టీ విస్తరనే తలక్ష్యంగా పనిచేయాలని సూచించారు. చంపాపేట డివిజన్ లో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలని సూచించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుముకని ఎమ్మెల్యే అన్నారు.
కార్యకర్తల తరువాతే నాయకులని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీకి కూడా ప్రజల్లో మనగడ ఉండదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులందరి సమష్టి కృషితో ప్రజల్లోకి తీసుకెల్లి పార్టీ ప్రతిష్టను పెంపొందించాలని డివిజన్ కమిటీని ఆదేశించారు. కార్యక్రమంలో చంపాపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, యూత్వింగ్ అధ్యక్షుడు రవిముదిరాజ్, నాయకులు ఆనగొంది జంగయ్య తదితరులు పాల్గొన్నారు.