వనస్థలిపురం, అక్టోబర్ 8 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హయత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ నూతన కమిటీ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రజలకు సమాచారం చేరవేయలన్నారు. అనంతరం నూతన కమిటీ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, నూతన అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు అంజలి, భాస్కర్‌సాగర్, రాకేశ్, రఫీక్, మల్లీశ్వరిరెడ్డి, నక్క రవీందర్, చెన్నగోని రవి పాల్గొన్నారు.