మన్సూరాబాద్, అక్టోబర్ 2: ఫొటో, వీడియోగ్రాఫర్లు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని సరికొత్త తరహాలో ఫొటోలు, వీడియోలను తీస్తూ అవకాశాలను పొందాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, ఫొటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దక్షణ భారత దేశ స్థాయి ఫొటో ట్రేడ్ ఎక్స్పోను శనివారం ఆయన సందర్శించి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కొత్త పంథాలను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.వెంకట్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి మునగాల శైలేంద్ర, ఉపాధ్యక్షుడు జగదీష్, సంయుక్త కార్యదర్శి జంగారెడ్డి, ఫోటోటెక్ చీఫ్ ఎడిటర్ అభిమన్యు రెడ్డి పాల్గొన్నారు.