మన్సూరాబాద్, సెప్టెంబర్ 15 : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని హిందూ అరణ్య ఎదురుగా ఫతుల్లాగూడకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న శ్మశానవాటిక వరకు ఏర్పాటు చేసిన రోడ్డును బుధవారం ఆయన మార్నింగ్ వాక్ చేసి పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో సుమారు 2.5 కిలోమీటర్ల పొడవులో నాటిన 25 వేల మొక్కలను పరిశీలించి మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వలన స్వచ్ఛమైన గాలి లభించడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు ఉంటుందన్నారు.రెండున్నర కిలోమీటర్ల మేర వేసిన రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్‌గౌడ్, చిరంజీవి, కృష్ణ, రాజుగౌడ్, జగదీశ్‌యాదవ్, మహేశ్‌రెడ్డి, జంగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.