చంపాపేట, సెప్టెంబర్ 12 : చంపాపేట డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్ల 2లక్షలు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నిధుల లేమితో నిలిచిపోయిన రోడ్లు, యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమా రెడ్డి న్యూ మారుతినగర్ కాలనీవాసులతో కలసి ఆదివారం ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ డివిజన్ వార్డు కార్యాలయం ఎదురుగా ఉన్న రెడ్డి బస్తీ, మహాంకాళమ్మతోట, రామ చిలుకలబస్తీ, అంబేద్కర్ విగ్రహం వరకు రూ.50లక్షల 50వేలతో యూజీడీ పైప్‌లైన్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. రూ.70లక్షలతో కర్మన్‌ఘాట్ క్రాస్‌రోడ్డు (విష్ణు కాంప్లెక్స్) నుంచి తెలంగాణ ఫార్మసీ వరకు నూతన యూజీడీ ట్రంకులైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నామని వివరించారు. రూ.51లక్షలతో లోటస్ ల్యాఫ్ స్కూల్ ముందు నుంచి న్యూ మారుతి నగర్ రోడ్డు నంబర్ 1 మీదుగా పోచమ్మగడ్డ, మారుతి నగర్ చర్చి, సాయిరాం నగర్ కాలనీ, ప్రగతినగర్ వరకు యూజీడీ పైప్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రూ. 31లక్షలు చంపాపేట మానస గార్డెన్ నుంచి డీ మార్ట్ వరకు నూతనంగా యూజీడీ పైప్‌లైన్ నిర్మాణాలకు నిధులు మంజూరయినట్లు ఆయన వివరించారు. నిధులు మంజూరు చేయించినందుకు కాలనీల వాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.