చంపాపేట, సెప్టెంబర్ 11 : ధ్యానాంజనేయుని అనుగ్రహంతోనే ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకొచ్చి సహకారం అందిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో దాతల సహకారంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయంలో టాయిలెట్స్ ఏర్పాటుకు దాత జీవన్ ప్రసాద్ విరాళంగా ఇచ్చిన రూ.40లక్షలతో పూర్తయిన టాయిలెట్స్‌ను ప్రారంభించామన్నారు.
ఆలయ ప్రాంగణంలోని సరస్వతి దేవి ఆలయ మండప విస్తరణకు దాత గణేశ్ప్రసాద్జెశ్వాల్ రూ.2లక్షల 60వేల విరాళం, ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, ధర్మకర్తలు ట్రస్టు సభ్యులైన సామ రంగారెడ్డి, బసిగూడెం జంగారెడ్డి, పద్మాల శంకర్ కలిసి రూ.5లక్షలు విరాళం, ఆలయంలోని కోనేరు అభివృద్ధికి దాత వెలిశాల రవి ప్రసాద్ రూ.15లక్షలు విరాళం, ఆలయ ప్రాంగణంలోని గణేశ్ ఆలయం ముందు భక్తుల క్యూలైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు దాత దశరథ్ గౌడ్ రూ.4లక్షల విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలపారు. మొత్తం రూ.26 లక్షల 60 వేలతో ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులను త్వరలో పూర్తయ్యే విధంగా చూడాలని ఆలయ కమిటీని, ఆలయ నిర్వాహకులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ధ్యానాంజనేయ స్వామి అనుగ్రహంతోనే భక్తులు ముందుకొచ్చి వారి సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఆలయం వెనకాల ఉన్న కొంత స్థలం కోర్టు వివాదంలో ఉందన్నారు. త్వరలో ఆలయానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. తీర్పు అనుకూలంగా వస్తే ఆలయ విస్తరణకు మరింత విశాలమైన స్థలం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, మాజీ వార్డు సభ్యులు మాధవిరెడ్డి, అనసూయ, ముడుపు రాజిరెడ్డి, నాయకులు గోపాల్ ముదిరాజ్, రవిముదిరాజ్, కొత్తపేట ప్రభాకర్, ఆలయ ధర్మకర్తలు చేగోని మల్లేశ్‌గౌడ్, చెలమల యాదిరెడ్డి, నర్రె శ్రీనివాస్, అకిలసాగర్, బీజేపీ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి రవీందరరెడ్డి, సీనియర్ నాయకులు సద్ది సందీప్‌రెడ్డి, సదానంద్‌రెడ్డి, సుంకరి రమేశ్‌గౌడ్, లింగాల దశరథ్‌గౌడ్, అమిత్, సుమిత్, శ్రీధర్ గౌడ్, తాళ్ల ప్రమోద్ గౌడ్ కోయిలకొండ సాయి, తదితరులు పాల్గొన్నారు.