ఎల్బీనగర్, సెప్టెంబర్9: అతి త్వరలోనే నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్న కాలనీలు, యూఎల్సీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాలనీలకు విముక్తి లభిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తపేటలో నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్, యూఎల్సీ సమస్యలు ఉన్న కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేతోపాటు తెలంగాణ ప్రభుత్వ అసిస్టెంట్ కార్యదర్శులు శ్రీనివాస్, కిషన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చొరవతో పరిష్కరిస్తామన్నారు. హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, నాగోల్, మన్సూరాబాద్, హస్తినాపురం, చంపాపేట డివిజన్ల పరిధుల్లోని రిజిస్ట్రేషన్ సమస్యల తోపాటుగా అసైన్డ్ ల్యాండ్ సమస్యలు, యూఎల్సీ సమస్యలను కూడా పరిష్క రిస్తామన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.