ఎల్బీనగర్, సెప్టెంబర్ 4 : అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు మేలు చేయాలన్న లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేదలకు ఆర్థికంగా ఆసరా లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా 97 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్‌గౌడ్, నాయకులు అనంతుల రాజారెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్, యాదిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఫీ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.