చంపాపేట,సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహించి విద్యా బోధన జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు పెరిగాయన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించిందని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులతో పాటు బోధన సిబ్బంది తప్పని సరిగా మాస్కూలు ధరించాలన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పటిష్టమైన జ్రాగత్తలు తీసుకుని విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత బోధన సిబ్భందిపై ఉందన్నారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.