మేడ్చల్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ జగన్‌గూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు మాటలే తప్ప చేతలు సాధ్యం కావన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ర్టాన్ని దివాళ తీయించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
మళ్లీ మాయ మాటలతో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్గూడను ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతో అభివృద్ధి చేశానని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులు విష్ణువర్ధన్ రెడ్డి, జంగారెడ్డి, కవితకు ఓటేసి గెలిపిస్తే అండగా ఉంటామని, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి గజ్జెల నాగేశ్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డి, రామిడి మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం..
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 8: ఇచ్చిన హమీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఐదేండ్లు ఇబ్బందులు పడుతారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో ఎమ్మెల్యే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిలకల్లో ఇచ్చి హామీలను అమలుచేయడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నీటి సమస్య నెలకొందని, కరంట్ సక్రమంగా రాక వ్యాపారాలు నడుస్తలేవని, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలపించాలని ఓటర్లను కోరారు. మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, శ్రీరంగవరం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో మల్లారెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ను అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, నాయకులు రఘుపతిరెడ్డి, నవీన్‌రెడ్డి, శంకర్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వండి..
శామీర్ పేట, ఫిబ్రవరి 8: అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లను కోరారు. మున్సిపల్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలపుడు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని.. మరోసారి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. అలియాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా చీదు వనజ శ్రీనివాస్ రెడ్డిని బరిలో నిలిపామని, బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించి ఆమెను చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో మలాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు..వెంకట్ రెడ్డి, జేఏసీ వెంకన్న, నగేష్ గౌడ్ పాల్గొన్నారు.