ఉప్పల్, ఏప్రిల్ 3 : సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసే బీజేపీని నిలదీయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని ఆదర్శనగర్‌లో సోమవారం చిలుకానగర్ డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలుకానగర్ డివిజన్లో రూ. 21 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాప్రా, ఉప్పల్ సర్కిల్లో అభివృద్ధి పనుల కోసం ఇటీవలే రూ.16 కోట్లు మంజూరు చేయించామన్నారు.
సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి ప్రజలకు అడగకుండానే అన్నిరకాల పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. పార్టీలోని నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మాజీ రాష్ట్ర కార్యదర్శి నెర్ధం భాస్కర్‌గౌడ్, జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బద్ధం భాస్కర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్‌రావు, లేతాకుల రఘుపతిరెడ్డి, ఎదుల్ల కొండల్‌రెడ్డి, గుడి మధుసూదన్‌రెడ్డి, పిట్టల నరేశ్, ఎలుగేటి మోహన్‌రెడ్డి, జెల్లి మోహన్, కొకొండ జగన్, పలువురు నేతలు పాల్గొన్నారు.