మల్లాపూర్, ఆగస్టు 24 : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మీర్పేట్ హెచ్కాలనీ డివిజన్ కైలాసగిరిలో ఎన్ఎఫ్సీ గోడ కూలి ఇండ్లు ధ్వంసమయ్యాయి. నివాసముంటున్న వారు తీవ్ర గాయాలకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణ సహాయం అందించి పూర్తిగా ధ్వంసమైన ఇంటి బాధితులకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈ రూప, ఏఈ తిరుమలయ్య, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వీఆర్ఏ శ్రీను, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
రామంతాపూర్, ఆగస్టు 24 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో చిలుకానగర్‌కు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. సిద్దులుకు రూ. 39, 500, రాంరెడ్డికి రూ. 44 వేలు, పద్మకు రూ. 60 వేలు, రాములు యాదవ్‌కు రూ. 30వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎందరో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి తాము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, ఆకుల మహేందర్, వీబీ నర్సింహ, వెంకటేశ్, బింగి శ్రీనివాస్, అన్యబాలకృష్ణ, రాంరెడ్డి, టీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, సుధాకర్, గడ్డం రవికుమార్, శంకర్ పాల్గొన్నారు.
రాఖీ పండుగను పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ త్రిలోచన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి మంగళవారం రాఖీ కట్టారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మనోజ్‌కుమార్, అశోక్‌రెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్, గడ్డం రవికుమార్, సుధాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాప్రా, ఆగస్టు 24 : వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ వలువర్ నగర్ బస్తీ దవాఖానలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రహిత గ్రేటర్ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో అందరూ పాల్గొనాలన్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వే, అవగాహన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని, ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డీసీ శంకర్, కార్పొరేటర్ స్వర్ణరాజు, వైద్యురాలు డాక్టర్ శైలజ, ఈఈ కోటేశ్వర్రావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాప్రా, ఆగస్టు 24 : చర్లపల్లిలోని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) సంస్థ అందించే వివిధ ప్లాస్టిక్ కోర్సుల పట్ల విద్యార్థులు అవగాహన ఏర్పరచుకొని వాటి ద్వారా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిపెట్ ప్రతినిధులు కాప్రాలో ఎమ్మెల్యేను కలిసి సంస్థ అందిస్తున్న ప్లాస్టిక్ కోర్సులకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఉచిత భోజనం, హాస్టల్ వసతి, స్కాలర్షిప్పులతో పాటు ఉపాధి కల్పిస్తున్న కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిపెట్ ప్రతినిధులు గోవిందనాయక్, కార్పొరేటర్ స్వర్ణరాజు, సుడుగు మహేందర్‌రెడ్డి, బద్రుద్దీన్, ఎన్ మహేశ్, కొండల్‌గౌడ్, కొప్పులకుమార్, బంక వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.