మల్లాపూర్, మార్చి 14 : ఉప్పల్ నియోజకవర్గంలో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరంగా థీమ్ పార్కులు ఏర్పాటు చేయడంతో చిన్నారులకు, యువకులకు, వృద్ధులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు. మల్లాపూర్ డివిజన్లో థీమ్ పార్కు(Theme park)లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గురువారం కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కులో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు శేఖర్, లోకేశ్, శ్రావణి, జలమండలి డీజీఎం. సతీశ్, జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రూప, ఏఈ స్రవంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.