రామంతాపూర్, ఏప్రిల్ 17: సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్‌చాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా, అరోరా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి అకాడమీలో వైస్‌చాన్సలర్‌గా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్)కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగాను పనిచేశారు. వీసీగా నియమితులైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఆయన అనుభవం గిరిజన విశ్వవిద్యాలయం పురోభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ , బీజేపీ నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20న నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్‌లో జరిగే తన కూతురు అలేఖ్య రెడ్డి వివాహానికి రావాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. గురువారం బంజారా హిల్స్ నంది నగర్‌లోని నివాసంలో కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.