హఫీజ్‌పేట్, జూలై3: కాలనీ, బస్తీల రూపురేఖలు మార్చడానికే పట్టణప్రగతి కార్యక్రమమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మూడోరోజు హఫీజ్‌పేట్ డివిజన్ ఓల్డ్హఫీజ్పేట్లో కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ, బస్తీలలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న పట్టణ ప్రగతికార్యక్రమంలో సీజనల్వ్యాధుల నివారణకోసం పారిశుధ్యం, నీటినిల్వల తొలగింపు, దోమలమందు పిచికారీ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, ఈఈ శ్రీకాంతి, హెల్త్‌ఆఫీసర్ కార్తీక్, జలమండలి డీజీఎం నాగప్రియ, ఏఈ ధీరజ్, ట్రాన్స్‌కో ఏఈ ఖాద్రీ, శానిటేషన్ యస్‌యస్ శ్రీనివాస్, యస్ఆర్పీ మహేశ్, ఎంటమాలజీ సిబ్బంది నాయకులు బాల్లింగ్ యాదగిరిగౌడ్, డివిజన్ అధ్యక్షుడు గౌతంగౌడ్, సంజీవరెడ్డి, వాలాహరీశ్రావు, లక్ష్మారెడ్డి, శాంతయ్య, వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.