శేరిలింగంపల్లి, జూలై 2: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండో రోజు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నిర్వహించిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కాలనీలో మొక్కలు నాటారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన ఆరోగ్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీ వెంకన్న, ఏఎంవోహెచ్ డాక్టర్ రవి, డీఈ విశాలక్ష్మి, స్థానిక వార్డు కమిటీ సభ్యురాలు శ్రీకళ, స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం హరితహారం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ఏఎంఓహెచ్ డాక్టర్ రవి, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, కాలనీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్, జూలై 2 : పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో కార్పొరేటర్లు షేక్ హమీద్ పటేల్, నాగేందర్ యాదవ్‌లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కాలనీలో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణలో వృక్షాల ప్రాధాన్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీఈ రమేశ్, ఏఈ ప్రతాప్, జలందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, రమేశ్, బలరాం యాదవ్, గౌరీ, నరసింహసాగర్, చాంద్‌పాషా, శ్రీనివాస్, తిరుపతి, నందు, నరేశ్, గణపతి, రవిగౌడ్, ఎస్ఆర్పీ కిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.