హఫీజ్‌పేట్, సెప్టెంబర్ 7: వీధి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ హుడాకాలనీ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాన్ని కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, మంజులారఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ ఉప కమిషనర్ నందగిరి సుధాంశ్, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి వత్సలా దేవి, ఈఈ శ్రీకాంతినితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెండింగ్ జోన్ల తరహాలోనే పైలెట్ ప్రాజెక్టుగా హఫీజ్‌పేట్ డివిజన్ హుడా కాలనీలో ఏర్పాటు చేశామన్నారు. విశాలమైన వాతావరణం, సకల హంగులతో సుమారు 120 మంది వ్యాపారులు వినియోగించుకునేలా వసతులు ఏర్పాటు చేశామన్నారు. వీధి వ్యాపారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, డివిజన్ అధ్యక్షులు గౌతంగౌడ్, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నాయకులు మిరియాల రాఘవ రావు, వాలా హరీశ్, కరుణాకర్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, దొంతి శేఖర్, పద్మారావు, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.